బూర్గంపాడు మండలంలో శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా ఎమ్మెల్యే ఇరవెండి గ్రామంలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేస్తారని అన్నారు. అనంతరం సారపాక ఐటీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అధికారులు గమనించాలన్నారు.