ప్రజలు అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే

60చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండండి: ఎమ్మెల్యే
రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోదావరి ఉదృతంగా ప్రవహించడంతో వరద పోటెత్తే ప్రమాదముందన్నారు. చేపల వేటకు ఎవ్వరూ వెళ్లొద్దని, అధికారులు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్