పినపాక మండలం అమరారం గ్రామపంచాయతీ పరిధిలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం ప్రారంభించారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు.