మారుమూల గ్రామాలకు సైతం మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలం అమరారంలో మంగళవారం ఆయన పర్యటించారు. 20 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తుందని సూచించారు.