మణుగూరు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రాఘవరెడ్డి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశామని, ఇందుకుసంబంధించిన జాబితాను నోటీస్ బోర్డులో ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు వంటి అంశాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచించారు.