పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లీశ్వరి(40) భర్త అనారోగ్యంతో మృతి చెందారు. భర్త మరణంతో మల్లీశ్వరి కుంగుబాటుకు గురైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడంతో కటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కుమార్తె పవిత్ర ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.