సర్వశిక్ష ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆళ్లపల్లి కేజీబీవీ విద్యార్థులు పాఠశాల ఎదుట వారి పుస్తకాలు వారు తీసుకొని వారే స్వయంగా పాఠాలు బోధించుకుంటూ సెల్ఫ్ టీచింగ్ చేస్తూ మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఉపాధ్యాయుల, సిబ్బంది యొక్క సమస్యలు పరిష్కారం చేసి రెగ్యులర్ గా విద్యార్థుల చదువులు ముందుకు కొనసాగించాలని డివైఎఫ్ఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి హరికృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.