విజయవాడలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇస్కాన్ టెంపుల్‌లో కొలువైన రాధాకృష్ణులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ సందర్భంగా 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. రాధాకృష్ణులకు 2 వేల కిలోలతో పుష్పాభిషేకం నిర్వహించారు. మొత్తం మూడు రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇస్కాన్ టెంపుల్ నిర్వహించనుంది.