TG: బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లుగా పనికిరాని రాజకీయం చేశారాని.. కేటీఆర్ త్వరలో మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం అని అన్నారు. 'నోటి దూలతో మాట్లాడకు కేటీఆర్. రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ నీకు కనిపిస్తలేవా అన్నారు. 2014, 2018 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మీరు నెరవేర్చలేదు' అని ఎంపీ పేర్కొన్నారు.