రైతులపై లాఠీ ఛార్జ్ అత్యంత బాధాకరం: హరీష్ రావు

50చూసినవారు
రైతులపై లాఠీ ఛార్జ్ అత్యంత బాధాకరం: హరీష్ రావు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝులిపించడం దారుణం, అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ తెస్తానన్న మార్పు ఇదేనా?.. విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుంది. రైతన్నలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పి, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలను పంపిణీ చేయాలి' అని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్