తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లింగారెడ్డి దంపతుల హత్య ప్రతి ఒక్కరినీ కలచి వేసిందని పేర్కొన్నారు. పట్టపగలు వృద్ధ దంపతులను కిరాతకంగా హత్య చేశారని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్‌లో పది లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తక్షణమే హోం మంత్రిని నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.