తెలుగు రాష్ట్రాల్లో నువ్వుల పంటను విస్తృతంగా సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో సాగవుతున్న నూనె గింజల పంటలలో ఇదీ ఒకటి. అయితే ఈ పంటలో ఆకుముడత పురుగు తొలిదశలో చిన్న చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకొని లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. నివారణకు 20 మి.లీ క్వినాల్‌ఫాస్ (లేదా) 1.5 గ్రా.ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.