నువ్వుల పంట వేసిన 25 రోజుల నుంచి పంటలో పేనుబంక పురుగు ఆశించడం జరుగుతుంది. పిల్ల మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పాలిపోయి తర్వాత ఎండిపోతాయి. వాటి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల నుంచి తేనె లాంటి జిగురు పదార్థం విడుదలై మొక్క చుట్టుపక్కల చీమలు చేరతాయి. నివారణకు ఇమిడాక్లోఫ్రిడ్ 0.3ml లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.