తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. వెంటనే టీటీడీ, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సర్వదర్శన టోకెన్ల క్యూలైన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.