భవిష్యత్తుపై ఆశలతో ముందుకు కదులుతాం : హరీశ్‌రావు

72చూసినవారు
భవిష్యత్తుపై ఆశలతో ముందుకు కదులుతాం : హరీశ్‌రావు
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. 24 ఏళ్ల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని తెలిపారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడిందని పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పనిలేదని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ధైర్యం నింపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ, తమని తాము సంస్కరించుకుంటూ.. భవిష్యత్తుపై సరికొత్త ఆశలతో, ఆశయాలతో ముందుకు కదులుతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్