కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి రోజాపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే రోజాకు సీఎం పేషీలోని ఓ ఐఏస్ అధికారి అండగా నిలబడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఆ అధికారి సూచన మేరకే రోజా గత కొంత కాలంగా కూటమి ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయడం లేదని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.