దేశంలో ఎంతో కీలకమైన మహారాష్ట్రలో నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ క్రమంలో బీజేపీ తన అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. 99 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్ నైరుతి నియోజకవర్గం నుంచి, బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ భవాంకులే కంతి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉన్నాయి.