వృత్తి రీత్యా లోకోపైలట్లు కావాడం వల్ల రిపబ్లిక్ డే అయినా సరే విధుల్లోకి హాజరుకావాల్సిందే. డ్యూటీలో ఉండటంతో జాతీయ జెండాకు గౌరవం సమర్పించే ఖాళీలేని ఓ లోకోపైలట్, తన రైలు ముందు ఉన్న దేశ పతాకం బొమ్మపైనే తన దేశభక్తిని చాటుకున్నారు. దాన్ని పరిశుభ్రం చేసి పక్కన నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించి, అనంతరం విధి నిర్వహణకు వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.