టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాలు

80చూసినవారు
టీసీఎస్‌లో భారీగా ఉద్యోగాలు
నిరుద్యోగులకు టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) శుభవార్త చెప్పింది. ఈ ఏడాది 40 వేల మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5,452 మంది ఉద్యోగులను కూడా నియమించినట్లు ప్రకటించింది. దీంతో కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,06,998కి పెరిగినట్లు పేర్కొంది. మరోవైపు ఉద్యోగుల వేతనాలను కూడా సవరించింది. ప్రస్తుతం ఉన్న వేతనాలను 4.5 శాతం నుంచి 12 శాతానికి పెంచింది.

సంబంధిత పోస్ట్