జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విడుదలైంది. కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మార్చి 29న విడుదల కాబోతుంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్‌తో బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. మొత్తంమీద ‘మ్యాడ్ స్క్వేర్’ టీమ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.