తల్లికి వందనం త్వరలో విడుదల చేస్తాం: లోకేష్

59చూసినవారు
తల్లికి వందనం త్వరలో విడుదల చేస్తాం: లోకేష్
AP: రాష్ట్ర ప్రజలకు మంత్రి లోకేష్ శుభవార్త చెప్పారు. 'తల్లికి వందనం' పథకం కింద ప్రభుత్వం ఇంట్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇవ్వనున్న విషయం తెలిసిందే. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ (రైతుకు రూ.20,000) పథకాలను త్వరలోనే అమలు చేస్తామని లోకేశ్ మండలిలో ప్రకటించారు. ఏప్రిల్, మే నెలల్లో ఈ పథకాలు లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్