మాజీ మంత్రి కేటీఆర్ ఫై మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శుక్రవారం జియంఆర్ మాట్లాడుతూ చేసిన తప్పులు బయటపడుతుంటే అక్కసుతో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నారే తప్ప కేటీఆర్ లాగా భయపడలేదని తెలిపారు. ప్రభుత్వంపై కేటీఆర్ అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు.