దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండల కేంద్రంలోని పీహెచ్సిలో నూతన అంబులెన్స్ ను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన వైద్య రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రక్షలిస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే వైద్యారోగ్య శాఖపై ఏకంగా రూ. 10 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.