దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండలం అజ్జకొల్లు గ్రామానికి చెందిన భారతయ్య గుండె సంబంధిత వ్యాధితో హైద్రాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో కిత్స పొందుతున్నారు. ఈ మేరకు గురువారం గుండె ఆపరేషన్ కొరకు సీఎం సహాయ నిధి ద్వారా 4లక్షల రూపాయల ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.