మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో పట్టపగలే చీకటి పనులు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చౌరస్తాలో చుట్టూ బ్యానర్లు ఉండటంతో, పలువురు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పుడుతున్నట్లు శనివారం సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. జనసంచారం ఉన్న ప్రాంతంలోనే ఇలా బరితెగించారని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేయాలని ప్రజలు కోరారు.