మహబూబ్ నగర్: 54 పరీక్షా కేంద్రాలలో 20584 అభ్యర్థులు

72చూసినవారు
గ్రూప్-2 పరీక్షల రెండవ రోజు సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లాలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల నందు పోలీసు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సోమవారం మల్టీజోన్-II ఐజి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఎస్పీ జానకి ధరావత్ ఆధ్వర్యంలో 54 పరీక్షా కేంద్రాలలో 20584 అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఆదేశాల మేరకు భారీ బందోబస్తుతో పరీక్షా పేపర్లను హైదరాబాద్ కు పంపడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్