ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పాలమూరు నేత, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో కొత్వాల్ మాట్లాడుతూ. రాజీవ్ యువశక్తి పథకం, ఇందిరమ్మ మహిళా శక్తి పథకాల ద్వారా యువత, మహిళలు కూడా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.