IPL-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు SRH జట్టుకు అతిపెద్ద ఓటమి ఇదే. అంతకుముందు 2024లో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌తో దానికంటే పెద్ద ఓటమిని సన్‌రైజర్స్ చవిచూసి మరో చెత్త రికార్డు నెలకొల్పింది.