తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ

74చూసినవారు
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజుల్లో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది పలు సౌకర్యాలను కల్పించనుంది. ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం, ప్రసాదాలు, పలు సౌకర్యాలను పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్