ఏపీ హైకోర్టులో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఊరట లభించింది. తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ జారీ చేసిన నోటీసుల్ని సవాలు చేస్తూ రాంగోపాల్ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. విచారణలో రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.