IPL-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం SRHతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 29 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టిన వైభవ్ అరోరాకు 'ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్' అవార్డు లభించింది. వైభవ్ అరోరా తన బౌలింగ్ మాయాజాలంతో ట్రావిస్ హెడ్(4), అభిషేక్ శర్మ(2), క్లాసెన్(33)ను పెవిలియన్ బాట పట్టించారు. వికెట్ మెయిడిన్ కూడా సాధించారు.