వక్ఫ్ సవరణ బిల్లుపై రాజ్యసభలో జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వక్ఫ్ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత, బిహార్ సీఎం నీతీష్ కుమార్‌కు వేర్వేరుగా లేఖలు పంపించారు. ఈ బిల్లుకు JDU మద్దతు ఇవ్వడం ముస్లిం వర్గం పట్ల పార్టీ విధానాలకు విరుద్ధమని ఆ పార్టీ నేత మహ్మద్ ఖాసిం అన్సారీ పేర్కొన్నారు.