తమను సమాజంలో సాటి మనుషులుగా గుర్తించాలని మహబూబ్ నగర్ జిల్లాలో హిజ్రాలు ధర్నా చేపట్టారు. శుక్రవారం పట్టణంలోని తిరుమల దేవునిగుట్ట నుండి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో ఓ దుండగుడు దీపు అనే హిజ్రా ప్రేమించి పెళ్లి చేసుకుని దారుణంగా హత్య చేయడంను హేయమైన చర్య అన్నారు. ప్రేమ పేరుతో మోసం చేసిన దుండగుడుని ఉరితీయాలని డిమాండ్ చేశారు.