హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం శాసనమండలిలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ. అహర్నిశలు పనిచేస్తున్న హోంగార్డులకు హెల్త్ కార్డులు తప్పనిసరిగా ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సీఎల్, ఈఎల్, ఇవ్వాలని అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం వారిని దృష్టిలో పెట్టుకొని పర్మినెంట్ చేసి, వాళ్ల జీతాలను పెంచాలని ఎమ్మెల్సీ కోరారు.