అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మాల మహానాడు సంఘం నాయకులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య, నాయకులు కేశవులు, పట్టణ అధ్యక్షులు శివ కుమార్ తదితరులను 1 వ పట్టణ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్బంగా వారు అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు.