మహబూబ్ నగర్ జిల్లా పురపాలక పరిధిలోని 23 వ వార్డు పాత పాలమూరు ప్రాంతంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా వార్డు సభలను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో పేదలందరికీ సన్న బియ్యం ఇవ్వంనుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.