మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రైతు పండుగ సభలో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వివిధ కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతుల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలు పరిష్కరించి రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల మాదిరి తాము గాలి మాటలు చెప్పేటోళ్లం కాదని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతామని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రుణమాఫీ సక్రమంగా జరిగిందా అంటూ ప్రశ్నించారు.