APPSC చైర్‌పర్సన్‌గా అనురాధ?
ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు. గత 3 నెలలుగా ఖాళీగా ఉన్న ఈ పోస్టును భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏపీపీఎస్సీ నూతన చైర్‌పర్సన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధను నియమించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైల్ సీఎం చంద్రబాబుకు చేరినట్లు తెలుస్తోంది. కాగా, విభజన తర్వాత ఏపీ తొలి నిఘా చీఫ్‌గా అనురాధ పని చేశారు.