ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ

80చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండలం వింజమూరు గ్రామ పరిధిలోని గండి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూల మలుపులో ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన పకీరప్ప తోపాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్