ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసిన ప్రేయసి.. స్కూటర్‌ను కాల్చేశాడు (వీడియో)

62చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సంజయ్ కిరార్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. వారిద్దరికీ ఇటీవల గొడవ జరిగింది. అతడి ఫోన్ నంబరును ఆమె బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. దీంతో ప్రేయసిపై సంజయ్ కోపం పెంచుకున్నాడు. వారు ఉంటున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ప్రేయసి స్కూటర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇతర వాహనాలు సైతం కాలిపోయాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్