భౌతిక కాయానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన బాసు హనుమంతు

76చూసినవారు
భౌతిక కాయానికి పూలమాల వేసి, నివాళులు అర్పించిన బాసు హనుమంతు
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామానికి చెందిన ప్రసంగి భార్య ఎస్. మణెమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. వెంటనే విషయం తెలుసుకొని బిఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు శనివారం వారి స్వగృహానికి వెళ్లి, ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట నూరు పాషా, రాజు నాయుడు, మాజీ సర్పంచ్ సమ్మెలు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్