జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని కట్టకింద తిమ్మప్ప స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి విగ్రహానికి ఉదయం అభిషేకం, కుంకుమార్చన, వస్త్రాలంకరణ, మహా మంగళహారతి తదితర పూజలను నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.