మల్దకల్: మాజీ జడ్పీటీసీ కుమారుడి మృతికి ఎమ్మెల్సీ చల్లా సంతాపం

70చూసినవారు
మల్దకల్: మాజీ జడ్పీటీసీ కుమారుడి మృతికి ఎమ్మెల్సీ చల్లా సంతాపం
మాజీ జెడ్పీటీసీ పటేల్ అరుణ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పటేల్ రామచంద్ర రెడ్డి మృతి పట్ల ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం మల్దకల్ మండలం కుర్తి రావల్ చెర్వులోని రామచంద్ర రెడ్డి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ, ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్