అయిజ మండలం పులికల్ గ్రామపంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి విధి నిర్వహణలో అప్రమత్తంగా లేకపోవడంతో మంగళవారం జిల్లా కలెక్టర్ సంతోష్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లల్లో నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించకపోవడం, బిఎల్ ఓ విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడంతో మూడు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.