ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన కార్యక్రమాన్ని ఈ నెల 28లోగా పూర్తి చేయాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు ముందస్తుగా చేపట్టే ప్రీ రివిజన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి పరిశీలన, పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.