జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డా. సి లక్ష్మారెడ్డి సతీమణి డాక్టర్. శ్వేతా రెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు సోమవారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తిమ్మాజీపేట మండలం ఆవంచలో శ్వేతా రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. లక్ష్మా రెడ్డి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పద్మజారెడ్డి, బాలాత్రిపుర సుందరి దేవి పాల్గొన్నారు.