మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట పోలీసులు శుక్రవారం ముమ్మరంగా ద్విచక్ర వాహనాల తనిఖీలను నిర్వహించారు. ద్విచక్ర వాహనాలకు లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్ ఉండడంతోపాటు ద్విచక్ర వాహనదారుడికి లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. జిల్లా ఎస్పీ జానకి ధరావత్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్టు ఎస్ఐ వెల్లడించారు. వాహనదారులంతా తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.