జడ్చర్ల: పార్టీలుకాదు అర్హతను చూడండి: ఎమ్మెల్యేఅనిరుద్ రెడ్డి

79చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని రేకుల చౌడపూర్, ఊరంచు తండాలో మంగళవారం నిర్వహించిన గ్రామ సభల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నామని, కొందరు కాంగ్రెస్ వాళ్ళకి ఎంపిక చేస్తున్నారనడం అవాస్తవమన్నారు. పార్టీలు కాదు, అర్హత చూసి జాబితాలో పొందుపరచాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్