మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించుకుని కౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ మంగళవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి షరబతును భక్తులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, మైనారిటీ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.