మహబూబ్ నగర్: నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

81చూసినవారు
మహబూబ్ నగర్: నీటిశుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మల్లెబోయనపల్లిలోని నీటిశుద్ధి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఈఈ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డిలతో ఆమె చర్చించారు. రాబోవు రోజులలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రిపేరులో ఉన్న బోరు మోటార్లకు మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకు రావాలని కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్